Header Banner

తమన్నాకు రూ. 6.20 కోట్లు చెల్లించిన ప్రభుత్వం! ఏ మాయ చేసిందో గానీ..!

  Thu May 22, 2025 19:25        Cinemas

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. బంపర్ ఆఫర్ కొట్టారు. దీని వ్యాల్యూ 6.20 కోట్ల రూపాయలు. ప్రభుత్వం తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆమె ఈ హోదాలో కొనసాగనున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ పై ఆమె సంతకం చేశారు.


కర్ణాటకలోని ప్రఖ్యాత మైసూర్ శాండల్ సోప్ కు తమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. మైసూర్ శాండల్ సంస్థ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఆమె ప్రమోట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అడ్వర్టయిజ్ మెంట్లల్లో నటించనున్నారు. దీనికోసం కర్ణాటక ప్రభుత్వం ఆమెకు ఈ 6.20 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించింది.


ఇది కూడా చదవండి: మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం! ఇన్ స్టా పోస్ట్ వైరల్!

 

ఈ మేరకు కర్ణాటక ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శాంతమ్మ ఎన్ ఎం ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కు తమన్నా భాటియా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారని, రెండు సంవత్సరాల రెండు రోజుల పాటు ఆమె ఈ హోదాలో కొనసాగుతారని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన తమన్నా భాటియా ఇంత భారీ ఆఫర్ ఇవ్వడం పట్ల విమర్శలు తలెత్తాయి. సొంత రాష్ట్రానికి చెందిన నటీనటులు గానీ, వీఐపీలను గానీ సిద్ధరామయ్య ప్రభుత్వం విస్మరించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్ట్ అయ్యాయి. ఈ విమర్శలకు కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ ఇచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే తమన్నా భాటియాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వివరించారు. దక్షిణం- ఉత్తరాది రాష్ట్రాల్లో తమన్నాకు మంచి ఫాలోయింగ్ ఉందని గుర్తు చేశారు.


కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో మైసూర్ సోప్ అండ్ డిటర్జెంట్.. 81 శాతం మార్కెట్ ను కలిగివుందని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ స్థాయిలో తమ ఉత్పత్తులు ప్రమోట్ కావట్లేదని చెప్పారు. ఉత్తరాది మార్కెట్ లో ఆరు శాతం వాటా మాత్రమే ఉందని పేర్కొన్నారు. దీన్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతోనే తమన్నా భాటియాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని అన్నారు. కాగా- మైసూర్ శాండల్ సోప్, ఇతర ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రస్తుతం 23 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వచ్చే ఏడాది కాలానికి అంటే.. ఈ ఆర్థిక సంవత్సం ముగిసే సమయానికి ఎగుమతులను 80 దేశాలకు పెంచుకోవాలని భావిస్తోంది. దీనికి అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్రాండ్ ప్రమోషన్ చేపట్టింది. మైసూర్ శాండల్ బాత్ సోప్, డిటర్జెంట్ సోప్, బేబీ ఆయిల్, బేబీ సోప్, రెడ్ శాండల్ సోప్, బాడీ వాష్, టాల్కమ్ పౌడర్, హ్యాండ్ వాష్, మసాజ్ ఆయిల్, ఫేస్ ప్యాక్, అగరబత్తులు, కర్పూరం, ధూపం, లిక్విడ్ డిటర్జెంట్, ఫినాయిల్.. వంటి ప్రొడక్ట్స్ ను కర్ణాటక ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో రేషన్ కార్డుల గడువుపై సర్కార్ కీలక ప్రకటన! భారీ ఊరట!


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!



టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!



అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!




విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..

 

అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!




ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #AndhraPravasi #Tamanna #Rs6Crores #GovernmentPayment #TeluguCinema #FilmIndustry #BigDeal #PoliticalDrama #MoneyTalks